పదోన్నతుల ఫైల్ సీఎం వద్దకు

పోలీసు విభాగంలో పదోన్నతులకు సంబందించిన ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీలుగా అర్హత ఉన్న సీఐల జాబితాను సిద్దం చేసిన ఫైలును పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం పంపించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ క్లియరెన్స్ ఇవ్వగానే డీఎస్సీల పదోన్నతులు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది సీఐలకు సంబందించిన లిస్టు సీఎం వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది. ఇందులో వరంగల్, హైదరాబాద్ ఏరియాలకు చెందిన 1996 బ్యాచ్ సీఐలు సుమారు 85 మంది, 65 మంది 1998 బ్యాచ్ కు చెందిన వారి పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకె చెప్పగానే పదోన్నతులకు సంబందించిన ఆర్డర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

cm kcrdgp telanganaLatest NewsPromotion filetelangana newstelangana police