బుస్సు బుస్సన్న నాగన్న… ఎస్సైకి తప్పిన ప్రాణాపాయం…

దిశ దశ, తిమ్మాపూర్:

ఆ స్టేషన్ లో పోలీసులు ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు. స్టేషన్ కు వచ్చిన వారితో ఎస్సై మాట్లాడుతున్నారు. అంతలోనే ఆ స్టేషన్ కు అనుకోని జీవి ఒకటి చొరబడింది. ఎస్సైపైకి వస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్న వారు పాము పాము అని అరవగానే ఆయన కుర్చీలోంచి లేచి బయటకు జంప్ చేసేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గడగడలాండించే పోలీసులను హడలెత్తిపోయారు. ఎస్సై నరేందర్ రెడ్డి తన ఛాంబర్ లో కూర్చొని ఠాణాకు వచ్చిన వారితో మాట్లుతున్నప్పుడు ఆయన వెనక ఉన్న కిటీలోకించి ఓ నాగు పాడు ఆ గదిలోకి చొరబడింది. ఎస్సై భుజాలపైకి పాకేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎస్సైకి ఎదురుగా ఉన్న వారు సార్ పాము పాము అంటూ అరిచారు. వెంటనే ఆయన తన కూర్చీలోంచి లేచి తన టేబుల్ పై నుండి దూకేశారు. ఎస్సై ఆందోళనతో తన గది నుండి బయటకు పరిగెత్తడాన్ని చూసిన స్టేషన్ సిబ్బంది ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఎస్సై గదిలోకి పాము దూరిందని తెలుసుకుని పాములు పట్టే పోచయ్యను పిలిచారు. ఆయన ఎస్సై గదిలో ఉన్న నాగుపామును పట్టుకుని బయటకు తీసుకొచ్చి చంపాడు. ఎస్సై ఎదురుగా ఉన్న వారు అప్రమత్తం చేయనట్టయితే నాగు పాము ఆయనపైకి పాకేదని ప్రతక్ష సాక్షులు చెప్తున్నారు.

karimnagar newsKARIMNAGAR POLICELatest NewssnakeTG NEWS
Comments (0)
Add Comment