జగిత్యాల జిల్లాలో గ్రానైట్ లారీ ప్రమాదం

క్లీనర్ దుర్మరణం

దిశ దశ, జగిత్యాల:

జగిత్యా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రానైట్ తీసుకెల్తున్న లారీ అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టడంతో క్లీనర్ అక్కడికక్కడే చనిపోగా లారీలో చిక్కుకున్న డ్రైవర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సంఘటనా వివారల్లోకి వెల్తే… గ్రానైట్ లోడుతో జగిత్యాల వైపు నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి మేడిపల్లి శివార్లలో చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవరు లారీ క్యాబిన్ లోని ఇరుక్కుపోయాడు. పోలీసులు తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ ను బయటకు తీసి చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్, క్లీనర్ ల వివరాలు తెలియాల్సి ఉంది.

crimecrime newsCRIME TODAYJAGITHYALtoday crime news