బాయిలర్ కోళ్ల ఫారం కోసం ఎన్ఓసీ… ఈఈ, ఏఈ ఏసీబీ ట్రాప్…

దిశ దశ, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ ట్రాప్ అయ్యారు ఇద్దరు ఇరిగేషన్ ఇంజనీర్లు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… సోనాల మండలానికి చెందిన ఒకరు బాయిలర్ కోళ్ల ఫారం పెట్టాలని నిర్ణయించుకున్నారు. నీటి పారుదల విభాగం పరిధిలోని ఉప కాలువ సమీపంలో నిర్మిస్తున్నందున నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ అవసరం ఏర్పడింది. ఎన్ఓసీ కావాలని ఇరిగేషన్ ఇంజనీర్లను అడగగా రూ. లక్ష డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఆదిలాబాద్ ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ రుపావత్ రమేష్ లు గురువారం రూ. 60 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఫినాప్తలిన్ టెస్ట్ చేసిన అనంతరం అరెస్ట్ చేశామని వీరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని తెలిపారు ఏసీబీ అధికారులు. మరో వైపున హైదరాబాద్, ఊట్నూరులోని ఇంజనీర్ ఇండ్లలో సోదాలు చేస్తున్నాయి ఏసీబీ బృందాలు. ఇప్పటి వరకు ఓ లాకర్ ను గుర్తించినట్టుగా తెలుస్తోంది. తనిఖీలు పూర్తయిన తరువాత అక్రమ ఆదాయం లెక్కలు తేల్చే అవకాశం ఉంది.

ACB RAIDSACB searchesACB TELANGANAACB TrapTELANGANA ACB
Comments (0)
Add Comment