Jagityala: సొగసు చూడ తరమా..?

తొలికరితోనే జలమయమైన రోడ్లు…

దిశ దశ, జగిత్యాల:

గంట సేపు పడ్డ వానతో జగిత్యాల పట్టణం అంతా జలమయం అయిపోయింది. తొలకరి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా అన్న ఆందోళన మొదలైంది. గురువారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గంటకు పైగా కురిసిన వానతో జిల్లా వాసులు అతలాకుతలం అయ్యారు. పట్టణంలోని టవర్ సర్కిల్, సార్గమ్మ సంధి, పోచమ్మ వాడ, గంజ్ రోడ్, ధరూర్ క్యాంప్ హౌజింగ్ బోర్డ్, చిలుక వాడ తదితర ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పట్టణంలోని డ్రైనేజీల నుండి ప్రవహించాల్సిన నీరంతా వర్సంతో ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆ నీటిలోనే వీధుల్లో తిరగాల్సిన దుస్థితి ఎదురు కావడం పట్టణ వాసుల అవస్థలు పడ్డారు. వర్షపు నీరు డ్రైనేజీల నుండి దిగువ ప్రాంతాలకు వెల్లిపోయే పరిస్థితి లేకపోవడం వల్లే చాలా ప్రాంతాల్లోని రోడ్లు జలమయం అయ్యాయని తెలుస్తోంది. మొదట్లోనే పట్టణ రోడ్లు ఇలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడితే రానున్న కాలంలో భారీ వర్షాలు పడినప్పుడు ఎలా అని ప్రశ్నిస్తున్నారు పట్టణ వాసులు. గురువారం నాటి వర్షం మునిసిపాలిటీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు అయిందని, రోడ్లపైకి వరద నీరు రాకుండా ఉండే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జగిత్యాల వాసులు కోరుతున్నారు.

You cannot copy content of this page