సోమారం మోడల్ స్కూల్ చుట్టూ చేరిన నీరు


దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వరద నీరు అతలాకుతలం చేస్తోంది. మండలంలోని సోమారం మోడల్ స్కూల్ చుటూ వరద నీరు వచ్చి చేరడంతో విద్యార్థులను పోలీసులు సురక్షితంగా తరలించే ప్రయత్నం చేశారు. తాడు సాయంతో స్టూడెంట్స్ ను బయటకు తీసుకొచ్చిన పోలీసులు వారి వారి ఇండ్లకు పంపిస్తున్నారు.