దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం భారీగా డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా అడిషనల్ ఎస్పీలకు స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో మొత్తం 30 మందికి బదిలీలు అయ్యాయి. ఖమ్మంలో అడిషనల్ డీసీపీగా పని చేస్తున్న ఏ నరేష్ కుమార్ ను భూపాలపల్లి జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ ను వరంగల్ కమిషనరేట్ క్రైమ్స్ కు, ఎన్ ఉదయ్ రెడ్డిని మాదాపూర్ అడిషనల్ డీసీపీగా, మాదాపూర్ అడిషనల్ డీసీపీగా పని చేస్తున్న ఎస్ జయరాం TGICCCకి, మేడ్చల్ ఎస్డీ అడిషనల్ ఎస్పీ మెహ్మద్ ఫజుల్ రహ్మాన్ ను సీఐడీకి, విశ్వప్రసాద్ ను మేడ్చల్ జోన్ ఎస్ఓటీకి, గొల్ల రమేష్ ను నల్గొండ అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా, బి రాములు నాయక్ కు నిర్మల్ ఆపరేషన్స్ అడిషనల్ ఎస్పీగా, హైదరాబాద్ సిటీ ఈఓడబ్లులో పని చేస్తున్న యు రవిందర్ రెడ్డికి సూర్యపేటకు, ఎం నాగేశ్వర్ రావుకు డీజీపీ ఆఫీసుకు, ఎస్ చంద్రకాంత్ కు సీఐడీకి, సీఐడీలో పనిచేస్తున్న ఏ లక్ష్మికి ఎల్బీనగర్ ట్రాఫిక్ కు, మహ్మద్ అస్వక్ సెంట్రల్ జోన్ కు, బి ఆనంద్ సెంట్రల్ జోన్ కు, బి కృష్ణగౌడ్ డీజీపీ ఆఫీసుకు, అందె రాములును ట్రాఫిక్ 2 హైదరాబాద్ కు, వి రఘు ఇంటలీజెన్స్ కు, టి గోవర్దన్ వెస్ట్ జోన్ కు, ఆర్ ప్రభాకర్ రావు వరంగల్ లా అండ్ ఆర్డర్ కు, కె శ్రీకాంత్ సౌత్ ఈస్ట్ జోన్ కు, సుందరగిరి శ్రీనివాస్ రావు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ కు, సి కుషల్కర్ సిద్దిపేట అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా, జి నరేందర్ ను భద్రాద్రి కొత్తగూడెం ఆపరేషన్స్ అడిషనల్ ఎస్పీగా, ప్రతాపగిరి వెంకట రమణ కరీంనగర్ కు, కె పూర్ణ చందర్ శంషాబాద్ కు, కె రాంకుమార్ డీజీపీ ఆఫీసుకు, జి హనుమంతరావు సైబరాబాద్ ట్రాఫిక్ కు, కొమ్మెర శ్రీనివాస్ రావు రాజేంద్ర నగర్ కు, ఎం సుదర్శన్ ఈఓడబ్లు 2 హైదరాబాద్ కు, కే శ్యాం ప్రసాదరావుకు సీఐడీలో పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.