దిశ దశ, హైదరాబాద్:
టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి అంగరక్షకులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆయన వద్ద డ్యూటీ చేయాల్సిన పోలీసులు తిరిగి వెల్లిపోవడంతో ఆయన రక్షణ వలయం లేకుండానే పర్యటనలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. అయితే రాచకొండ కమిషనరేట్ పోలీసులు రేవంత్ రెడ్డికి నలుగురు గన్ మెన్లను కెటాయించగా ముగ్గురు వెనుదిరిగిపోయి కమిషనరేట్ లో రిపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తనకు రక్షణగా ఉన్న ఒక్క గన్ మెన్ కూడా ఎందుకని వెల్లిపోవాలని రేవంత్ సూచించడంతో ఆయన కూడా వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. రెండు రోజులుగా ఒకే గన్ మెన్ ఆయన వద్ద ఉన్నారని మిగతా ముగ్గురు కమిషనరేట్ లో రిపోర్ట్ చేశారని తెలుస్తోంది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే గన్ మెన్లు ముగ్గురు వెళ్లిపోయారని, రాచకొండ కమిషనరేట్ పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఆ ఒక్క గన్ మెన్ ను కూడా రేవంత్ రెడ్డి తిప్పి పంపించారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Next Post
