కరీంనగర్ శివార్లలో రహస్య సమావేశం..?
దిశ దశ, కరీంనగర్ రూరల్:
కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ సర్పంచ్ రెండు రోజులుగా బయట కనిపించకుండా పోయారు. పోలీసులు అతని కోసం ఇంటికి వెల్లిన క్రమంలో తప్పించుకుని వెల్లిన ఆయన అండర్ గ్రౌండ్ లోనే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. బుధవారం సాయంత్రం నుండి జరుగుతున్న ప్రచారాన్ని బట్టి పురుమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారయినట్టుగా తెలుస్తోంది. గురువారం కరీంనగర్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీపీసీసీ చీఫ్, సీనీయర్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో పార్టీలో చేరినట్టయితే సర్కారు నుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ అండర్ గ్రౌండ్ లోనే మంత్రాంగం నెరిపి తన అనుచరులను సిద్దం కావాలన్న సంకేతాలు పంపించారని చెప్తున్నారు.
శివార్లలో సీక్రెట్ మీటింగ్..?
మరో వైపున పురుమళ్ల శ్రీనివాస్ వర్గానికి చెందిన కొంతమంది కరీంనగర్ శివారు ప్రాంతాల్లో రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. గురువారం నాటి సమావేశంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలి అన్న విషయంపై చర్చలు జరిపినట్టుగా స్థానికంగా అనుకుంటున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Next Post
