దిశ దశ, కరీంనగర్:
శాతవాహన యూనివర్శిటీ ప్రొఫెసర్, రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వయిజరీ మెంబర్ సూరపల్లి సూజత వివాదం అలుముకుంటోంది. ఆఫరేషన్ సిందూర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సూజత ఆపరేషన్ సిందూర్ పై షేర్ చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బుధవారం నుండే సోషల్ మీడియా వేదికగా సూరపల్లి సూజత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గురువారం బీజేపీ శ్రేణులో ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు నిరసనలు చేపట్టారు. శాతవాహన యూనిర్శిటీ వద్ద ప్రొఫెసర్ సూజాత దిష్టిబొమ్మను దగ్దం చేసిన బీజేపీ నాయకులు ఆమెపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను కలిసిన బీజేపీ నాయకులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా కామెంట్ చేసిన సూజాత దేశ సమగ్రతను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అంతటా సైనికుల చర్యలను శ్లాఘిస్తుంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రితో పాటు ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ ను సమర్థిస్తుంటే శాతవాహన ప్రొఫెసర్ సూజత మాత్రం భిన్నంగా నడుచుకున్నారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, సీనియర్ నాయకులు బాస సత్యనారాయణ, బోయినలపల్లి ప్రవీణ్ రావు, గుగ్గిళ్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.