శాభాష్ పల్లి వంతెన సమీపంలో తేలిన మృతదేహాలు
దిశ దశ, రాజన్న సిరిసిల్ల జిల్లా:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో సహ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. వీరిలో పద్నాలుగు నెలల పసికందు కూడా ఉండడం స్థానికులను కలిచి వేస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన రజిత కొడుకు ఆయాన్ (7), కూతురు అసరజాబీ (5), పద్నాలుగు నెలల పసికందు ఉస్మాన్ లతో కలిసి కరీంనగర్, వేములవాడ రహదారిలోని శాభాష్ పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలోకి దూకి ఆత్యహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే రజిత తన పిల్లలతో సహా కలిసి ఆత్మహత్యకు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అయితే రజిత కరీంనగర్ సుభాష్ నగర్ కు చెందిన వ్యక్తిని ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఈ ఘటన పూర్వాపరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
