దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం కల్గించింది. అయితే బాధితుడు ఆత్మహత్య చేసుకుంటుండగా ఎదురుగా ఉన్న వ్యక్తి అప్పటి వరకు గమనిస్తున్నట్టుగా ఉండి ఆ తరువాత పురుగుల మందు డబ్బా లాక్కోవడం గమనార్హం. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో కరీంనగర్ రూరల్ మండలం తొంటి పోచాలు అనే వ్యక్తి ‘ ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన కొలతలు చేస్తుండగా తనకు సంబంధించిన భూమి అందులో ఉందని గుజ్జుల జగన్ రెడ్డి అతని కొడుకు ప్రేమేందర్ రెడ్డిలు అడ్డుకున్నారు. దీంతో పోచాలు చొప్పదండి పోలీసులను ఆశ్రయించగా సివిల్ మ్యాటర్ అయినందున కోర్టును ఆశ్రయించాలని లేనట్టయితే బయటకు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శనివారం సాయత్రం ఠాణా ముందు కూర్చుని జగన్ రెడ్డి పురుగుల మందు తాగాడు. అయితే ఆయన తాగుతుండగా అతని ముందు నిల్చున్న వ్యక్తి చూస్తూ గమనించాడు. కొద్ది క్షణాల తరువాత పోలీస్ స్టేషన్ వైపు గమనించిన నిలబడ్డ వ్యక్తి జగన్ రెడ్డి తాగుతున్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజీని గమనించి పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం. పురుగుల మందు తాగిన జగన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
