మరో రోజు సెలవు పొడగింపు

దిశ దశ, హైదరాబాద్:

నిరాటంకంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం కూడా విద్యా సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొరనే అవకాశం ఉన్నందున శనివారం నాడు కూడా యథావిధిగా సెలవు కొనసాగించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం నుండి విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగనున్నాయి.