BIG BREAKING: సర్పంచ్ ఆత్మహత్యా యత్నం

పెద్దపల్లి జిల్లాలో ఓ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అడిగినందుకు లంచం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నారంటూ ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట సర్పంచ్ అన్నాడి రవిందర్ రెడ్డి తనకు సంబందించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని అడిగితే అధికారులు లంచం ఇవ్వాలని అంటున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను గ్రామంలో పనిచేసిన రూ. 25 లక్షలకు సంబందించిన బిల్లులు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ గ్రామ సర్పంచ్ సూసైడ్ అటెమ్ట్ కు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.