దిశ దశ, మానకొండూరు:
ఈత కోసం వెల్లి వ్యవసాయ బావిలో పడి పాలిటెక్నిక్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని సమ్మక్క సారలక్క గద్దె వద్ద ఉన్న వ్యవాసాయ బావిలో ఈతకని 20 మంది విద్యార్థులు గురువారం వెల్లారు. ఎల్ఎండీ కాలనీలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ సెకండ్ ఈయర్ చదువుకుంటున్న వీరంతా వ్యవసాయ బావి వద్దకు వెల్లిన క్రమంలో నీలపు బాలరాజు అనే స్టూడెంట్ ఈత కొడ్తామని అందులోకి దూకి గల్లంతయ్యాడు. ఈ సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా బాలరాజు(18) మృతదేహాన్ని గుర్తించారు. బాలరాజు పెద్దపల్లికి చెందిన వాడిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎల్ఎండీ పోలీసులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
