గండితో ప్రమాదేమేమీ లేదు: సీపీ రంగనాథ్

దిశ దశ, వరంగల్:

భద్రకాళి చెరువుకు గండి పడడం వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని వరంగల్ పోలీస్ కమిషన్ రంగనాథ్ వెల్లడించారు. గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు చెరువుకు గండి పడిందని కలవరపడాల్సిన అవసరమేమి లేదన్నారు. దిగువ ప్రాంతాలకు ప్రమాదేమేమి ఉండదని, అయితే ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే సమీప కాలనీలను ఖాలీ చేయిస్తున్నామన్నారు. వరద ఉధృతి తగ్గించేందుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటిని నిలిపి వేయించామని సీపి వివరించారు. ఇప్పటికైతే ప్రమాదేమమి లేదని అయినప్పటికీ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పర్యవేక్షణ జరుపుతున్నారని, డ్రోన్ ల ద్వారా కలెక్టర్ కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ తెలిపారు.