బయటకొచ్చిన కవితక్క

ఈడీ విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క శనివారం రాత్రి బయటకు వచ్చారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణ కోసం శనివారం ఉదయం 11.09 నిమిషాలకు వెల్లిన కవిత రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. మద్యాహ్నం సమయంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఈడీ కార్యాలయంలో తిరిగారు. సాయంత్రం 5.30 నుండి పిళ్లై, కవితలను పిలిచిన అధికారులు ఇద్దరిని ప్రశ్నించారు.

మళ్లీ 16న

తిరిగి ఈ నెల 16న కవితను విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. శనివారం కవితను విచారించిన బృందంలో జాయింట్‌ డైరెక్టర్‌, లేడీ డిప్యూటీ డైరెక్టర్‌ ముగ్గురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు ఉన్నారని తెలుస్తోంది. వీరు వివిధ కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించి కవిత నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే విచారణ ఇంకా పూర్తి కానందును తిరిగి ఈ నెల 16న రావాలని సమన్లు ఇచ్చారు.