karimnagar: దివి నుండి వాన… భువి నుండి భగీరథ…

దిశ దశ, కరీంనగర్:

బుధవారం సాయంత్రం కూడా కరీంనగర్ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. రహదారులన్ని జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలను క్లీన్ చేయించడంతో వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరుకుంటోంది. అయితే నిరాంటకంగా కురుస్తున్న వర్షంలో నగర వాసులకు మరో సమస్య వచ్చి పడింది. బుధవారం రాత్రి మంచిర్యాల చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోవడంతో ఫౌంటెన్ ను మరిపిస్తున్న రీతిలో నీరు ఎగిసిపడుతోంది. ఓ వైపున వర్షం, చీకటి అలుముకోవడంతో పైప్ లైన్ బాగు చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగానే తయారైంది. పైప్ లైన్ పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతంలో తాగు నీటి సరఫరా చేసే అవకాశం ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. తాగు నీటి సౌకర్యాన్ని పునరుద్దరించేందుకు అధికారులు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉంది.