కేటీఆర్ వెనక నుండి లాగిపడేసిన మంత్రి…
దిశ దశ, హైదరాబాద్:
మంత్రి కేటీఆర్ తో పాటు ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. మంత్రి కేటీఆర్ ముందు నడుస్తుండగా తలసాని ఆయన వెనక వెల్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్ లో మరో వ్యక్తి దూరి కెటీఆర్ వెన్నంటి ముందుకు సాగుతున్నారు. అంతే కోపగించుకున్న మంత్రి తలసాని నేరుగా అతని భుజంపై చేయి వేసి వెనక్కి లాగి చెంప ఛెల్లుమనిపించారు. కేటీఆర్ సమీపంలోకి చొచ్చుక వస్తున్న వారిని ఆయన అంగరక్షకకుల పక్కకు నెట్టేస్తున్న క్రమంలో కొంచెం నెమ్మదిగా నడుస్తున్న శ్రీనివాస్ యాదవ్ ముందు ఓ వ్యక్తి అడ్డురావడంతో మంత్రి సీరియస్ అయి ఉంటారని అంటున్నారు. అయినంత మాత్రాన ఏకంగా మంత్రే చేయి చేసుకోవడం ఏంటంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే వారు ఇలా అసహనం వ్యక్తం చేయడం సరికాదని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా మంత్రి తలసాని శ్రీనివాస్ కు సంబంధించిన ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది. ఆ వీడియో మీ కోసం…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
