చెల్లెలి కోసమేనా..?
రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెల్లారు. శనివారం ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వెల్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల ముందే ఢిల్లీకి వెల్లిన కవిత శుక్రవారం జరిగిన మహిళా బిల్లు ఆమోదం కోసం నిరసన దీక్ష చేపట్టారు. అయితే శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశంలో కూడా పాల్గొన్న కేటీఆర్ సాయంత్రి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారమే వెళ్లారా లేక చెల్లెలుకు ధైర్యం చెప్పేందుకు వెళ్లారా అన్నదే అంతుచిక్కకుండా పోయింది. అధికారిక కార్యక్రమాలు ఉన్నట్టయితే కేటీఆర్ ఆఫీసు నుండి ప్రకటన వెలువడేది కానీ అలాంటి ప్రకటన కూడా వెలువడకపోవడంతో ఆయన పక్కాగా కవిత విషయం గురించే వెల్లి ఉంటారని అంటున్నారు. అయితే ఇప్పటికే నిరసన కార్యక్రమం పేరిట తెలంగాణ నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా ఢిల్లీకి చేరుకున్నాయి. వారంతా కూడా ఢిల్లీలోనే రేపటి వరకు ఉండనున్నట్టు సమాచారం. కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఎలా..? అన్న సమాలోచనలు కూడా పార్టీ ముఖ్య నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు. ఆమె విచారణ ముగిసి బయటకు వచ్చే వరకు పార్టీ క్యాడర్ అంతా కూడా ఢిల్లీలోనే ఉండనుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ కూడా వెల్లి ఉంటారని తెలుస్తోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
