జీవన్ ఇంటికి రానున్న కేటీఆర్…

దిశ దశ, జగిత్యాల:

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గురువారం మద్యాహ్నం రానున్నారు. ఇటీవలె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ముహూర్తం అప్పుడే…

జీవన్ రెడ్డి ఈ నెల 27న జరగనున్న ప్లీనరీ సమావేశాల్లోనే అధికారికంగా చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు సమావేశాలను జగిత్యాలలో ఏర్పాటు చేసి జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకోవడంతో పాటు ఆయనకు కీలక పదవిని కట్టబెడుతున్నట్టుగా అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు.