ఢిల్లీలో ఏం జరుగుతోంది…?
ఇప్పటికే ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావల్సిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని తన ఇంట్లోంచి ఇప్పటికీ బయటకు రాకపోవడం సంచలనం కల్గిస్తోంది. 10 గంటలకే ప్రెస్ మీట్ అని ప్రకటించిన కవిత ఇంతవరకు సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుండి మాత్రం బయటకు రావడం లేదు. దాదాపు 15 నిమిషాల క్రితం కవిత ఎస్కార్ట్ వాహనం కూడా లోపలకు వెల్లినప్పటికీ ఇంతవరకు కవిత మాత్రం రాలేదు. 11 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకోవల్సి ఉన్న నేపథ్యంలో 10 గంటలకు మీడియాతో మాట్లాడాల్సి ఉంది. అయితే కవిత మాత్రం ఇంతవరకు బయటకు రాకపోవడం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ఈడీ కార్యాలయానికి తుగ్లక్ రోడ్ లోని కేసీఆర్ ఇంటికి 10 నుండి 15 నిమిషాల పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది. అయితే కవిత విచారణ నేపథ్యంలో తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ అధికారిక నివాసం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో పోలీసులు కూడా అక్కడ మోహరించారు. మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నప్పటికీ ఆమె మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Next Post
