Sand mafia: ఒకే ప్రొసిడింగ్ నంబర్… ఉత్తర్వులు మాత్రం ఎన్నో..?

దిశ దశ, కరీంనగర్:

లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టుగా ఉంది కరీంనగర్ జిల్లా ఇసుక రీచులను కొనసాగిస్తున్న తీరు. జిల్లాకు తెలిసే ఈ ప్రకటన వెలువడుతున్నాయా లేక వారిని ఏ మార్చిలో విడుదల చేస్తున్నాయా అన్న విషయం క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఇసుక రీచుల విషయంలో జారీ అయిన ప్రొసిడింగ్స్ నంబర్ మాత్రం అందరినీ గందరగోళంలో పడేస్తోంది.

ఒకే నంబర్…

కరీంనగర్ నిర్వహించడం మానకొండూర్, వీణవంక మండలాల్లో ఇసుక రీచుల విషయంలో ఒకే సిడింగ్ నంబర్ కేంద్రీకృతంగానే నిర్ణయాలు జరుగుతుండడం విచిత్రమనే చెప్పాలి. ఇంతకుముందు జారీ చేసిన ప్రొసిడింగ్స్ రెఫరెన్స్ చేసుకుని కొత్త ప్రొసిడింగ్స్ తీసే ఆనవాయితీకి బదులుగా పాత ప్రొసిడింగ్ నంబర్ తో నే కొత్త ఉత్తర్వులు వెలువడుతున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఒకే నంబర్ పై ఇసుక రీచులను నిలిపివేస్తున్నామని, అదే నంబర్ పై కొనసాగుతున్నామని కూడా ఉత్తర్వులు జారీ చేయడం వెనక అసలేం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న జిల్లా స్థాయి సాండ్ కమిటీ (DLSC) ఎప్పకప్పుడు సమావేశం అయి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒకే ప్రొసిడింగ్ నంబర్ పైనే కొత్త ఉత్తర్వులు వెలువడుతున్న తీరు విచిత్రంగా మారింది. 274/SAND/TSMDC/2022 తేది: 10.11.2023న ఇసుక రీచులను అనుమతిస్తూ ప్రొసిడింగ్స్ వెలువడ్డాయి. 274/SAND/TSMDC / KNR/23 తేది: -01.2024న విడుదలైన నోటిఫికేషన్‌లో కరీంనగర్ ఇసుక రీచులను నిలిపివేస్తున్నట్లుగా ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు విడుదల చేస్తున్న కరీంనగర్ కలెక్టర్, జిల్లా సాండ్ కమిటీ ఛైర్మన్ 2024 జనవరి 6న సంతకం చేసినట్టుగా వెలువడ్డాయి. తాజాగా 274/SAND/TSMDC/2022, తేది: 04.2025న కరీంనగర్ జిల్లా మానకొండూరు, వీణవంక మండలాల్లో ఇసుక రీచులను నిర్వహించేందుకు అనువుగా ఇస్తూ మరో ప్రొసిడింగ్ వెలువడింది. ఈ మేరకు ఆయా రీచుల్లో ఇసుక సేకరించి అమ్మకాలు జరిపే ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రొసిడింగ్ కు కూడా ఒకే నంబర్ అలాట్ కావడం, గతంలో విడుదలైన సంవత్సరాన్నే కొనసాగించడం విచిత్రం. జిల్లాలో ఇసుక రీచుల నిర్వహణ కోసం గతంలో జారీ అయిన ప్రొసిడింగ్స్ ఆధారంగా తాజా నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆ నెంబర్ ను రెఫరెన్స్ గా  తీసుకుని కొత్తగా మరో నంబర్ ద్వారా ప్రొసిడింగ్ విడుదల చేయవలసి ఉంటుంది. జిల్లాలో ఇసుక రీచులను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం విడుదలైన ఉత్తర్వులకు కూడా రీచులను కొనసాగించేందుకు జారీ చేసిన ప్రొసిడింగ్ నంబర్ నే వాడడం విచిత్రం. గతంలో జారీ చేసిన ప్రొసిడింగ్ ను రద్దు చేస్తూ కొత్త ప్రొసిడింగ్ నంబర్ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యే ఆనవాయితీ ఉంటుంది కానీ కరీంనగర్ సాండ్ కమిటీ మాత్రం ఒకే నంబర్ ప్రొసిడింగ్ ద్వారా కొనసాగిస్తున్న తీరు విచిత్రంగానే ఉంది.  తాజాగా విడుదల అయిన ప్రొసిడింగ్స్‌లో Lr.No.EE/ID.No.4/MNT/DB/HD/120/M, dt. 11-04-2025 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డివిజన్ నెం.4, మంథని, పెద్దపల్లి, 

కరీంనగర్ జిల్లా, వీణవంక, జిల్లా, మానకొండూర్, జిల్లా, మానేరు నదిలో పడే పూడిక తొలగింపు ప్రాంతాల ఉమ్మడి తనిఖీ నివేదికలు. 21.03-2025 ΤΟ 23-03-2025 మండలాలను రెఫరెన్స్‌గా తీసుకున్నట్లుగా స్పష్టంగా ఉన్నప్పటికీ 274/SAND/TSMDC/2022, తేది: 04.2025 నంబర్ పైనే ఆదేశాలు విడుదల చేశారు. కరీంనగర్ DLSC ఆనాటి సమావేశం నిర్ణయాలకు అనుగుణంగానే తాజా ప్రొసిడింగ్స్ జారీ చేసిందా..? కొత్తగా సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం లేదా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఒకవేళ అప్పటి ఉత్తర్వులనే అమలు చేసినట్టయితే కొత్తగా అధికారుల నివేదికలు తెప్పించుకోవడానికి కారణమేంటో అర్థం కావడం లేదు. కొత్తగా ప్రొసిండిగ్స్ విడుదల చేసి తాజా నంబర్లు, తేదీలు వేయాల్సినా… కరీంనగర్ జిల్లా ఇసుక రీచుల విషయంలో ఎందుకు ఇలా  జరుగుతోందోనన్నది మాత్రం అధికారులకే తెలియాలి.

You cannot copy content of this page