దిశ దశ, కరీంనగర్:
బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ లో ఉంటూ సమీకరణాలు నడుపుతున్న ఇంటి వాస్తు బాగోలేదన్న కారణంతో క్యాంప్ ఆఫీస్ ను మార్చేశారు. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండడం, అధిష్టానం వరకు ఈ అంశం చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమైనట్టుగా అర్థం అవుతోంది. బీఆర్ఎస్ స్థానిక క్యాడర్ నుండి మొదలు ముఖ్య నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ తన తప్పిదాలను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో ఇందుకు కారణమేంటన్న విషయాన్ని లోతుగా సమీక్షించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ సిద్దాంతి ద్వారా లోటుపాట్లను తెలుసుకున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సిద్దాంతి సలహాల మేరకే ఇప్పటి వరకు హుజురాబాద్ పట్టణంలో క్యాంపు ఆఫీసు నిర్వహించిన ఇంటిని వెంటనే ఖాలీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఆఫీసును వీణవంకలోని తన ఇంటికి మార్చుకున్న ఎమ్మెల్సీ ప్రత్యామ్నాయంగా మరో ఇంటిని వెతికి అక్కడ నూతన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అన్ని విధాల అనుకూలంగా ఉన్న ఇంటి కోసం ఇప్పటికే కౌశిక్ రెడ్డి అనుచరులు హుజురాబాద్ లో అన్వేషణ మొదలు పెట్టారని సమాచారం. ఇప్పటి వరకు ఉన్న క్యాంపు ఆఫీసు వాస్తు ప్రభావం వల్లే కౌశిక్ రెడ్డి ఇబ్బందులు పడ్డారని కూడా సిద్దాంతి చెప్పినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆఫీసుతో ఇప్పటి వరకు జరిగిన దుష్ప్రచారానికి చెక్ పడుతోందని కూడా చెప్పారని కూడా అంటున్నారు. కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటయ్యే వరకు వీణవంకలోని తన సొంత ఇంటినుండే సమీకరణాలు చేయాలని కౌశిక్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. వాస్తు సిద్దాంతి చెప్పినట్టుగా ముందు ముందు సానుకూల వాతావరణం ఏర్పడుతుందో లేదో చూడాలి మరి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
