దిశ దశ, జగిత్యాల:
నువ్వు ముసలిదానివి అయిపోయావ్… నేను వయసు దానిని తెచ్చుకుంటాననడం పద్దతేనా..? నేను ముసలిదాన్నే కావచ్చు కానీ నేను మనిషిని కాదా… నాకు మనసు లేదా అంటూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జన సమీకరణ చేసే పనిలో జీవన్ రెడ్డి నిమగ్నం అయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎత్తి చూపుతున్నట్టుగా ఉన్నాయి. నా జీవితం కాలం కష్టపడి పెంచి పెద్ద చేసిన తరువాత ముసలిదానివయ్యావు వయసు దానిని తెచ్చుకుంటానని అనడం సమంజసమేనా అని జీవన్ రెడ్డి ప్రశ్రించారు. ఇంటికి పెద్దోనివి అయిపోయావని ముసలిదాన్ని పక్కన పెట్టుకుని బ ఇంకో వయసు దానిని పక్కన పెట్టుకుంటానంటే ఊరుకుంటానా..? నేను ఇంకో ముసలోన్ని చూసుకుంటానని కామెంట్స్ విన్నవెంటనే సభలో నవ్వులు విరిశాయి.
అందుకేనా..?
అయితే తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనక మర్మం వేరే దాగి ఉన్నట్టుగా అర్థం అవుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికలపై ఇద్దరు వృద్దులు ఒకే చోటకు చేరుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నట్టగా అనిపిస్తోంది.

