భార్య, బిడ్డల కోసం భర్త ఆందోళన…

భార్య కాపురానికి రావాలని…

కొడుకును చూపించాలని డిమాండ్

దిశ దశ, జగిత్యాల:

భార్య కాపురానికి రావడం లేదంటూ భర్త అత్తింటి ముందు నిరసన చేపట్టాడు. తన కొడుకును తనకు చూపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించాడు. మహిళా సంఘాల ప్రతినిధులు కూడా ఆయనకు బాసటగా నిలవడం గమనార్హం. అయితే తన మెట్టినింటి వారి నుండి ప్రాణ హాని ఉందని, తన నగలను లాక్కున్నారని భార్య ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది. బాధితుల కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన గాజుల అజయ్, శివానిలకు 2021లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఉపాధి కోసం అజయ్ విదేశాలకు వెలుతుంటాడు. గత కొంతకాలంగా అజయ్ స్థానికంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తన భార్య శివాని గత కొంత కాలంగా తనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లిపోయిందని కలిసి జీవనం చేద్దామని ఎన్ని సార్లు ప్రాధేయపడినా రావడం లేదని కనీసం తన కొడుకును కూడా తనకు చూపించడం లేదని ఆరోపిస్తున్నాడు. ఆదివారం కోరుట్లలోని తన అత్తింటి ముందు అజయ్ తన కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపాడు. కొడుకును కూడా చూపించకుండా తనను మానసిక క్షోభకు గురి చేస్తోందని, తన తల్లిదండ్రులతో భయం ఉందని తనకు మెసెజ్ ద్వార సమాచారం పంపించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. తన తల్లిదండ్రలకు ఏకైక సంతానం అయిన తాను వారికి దూరంగా ఉండలేనని వివరించిన అజయ్ తన మామను కూడా ఇదే విధంగా మానసిక క్షోభకు గురి చేశారని ఆరో్పిస్తున్నారు. అజయ్ అత్తింటి ముందు బైఠాయించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో అజయ్ భార్య శివాని చేస్తున్న ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి. తనకు తన భర్త, అత్తా, మామాలతో ప్రాణ హాని ఉందని, తన వద్ద ఉన్న నగలు కూడా లాక్కున్నారని ఆరోపిస్తోంది.

You cannot copy content of this page