బాధితురాలి మృతదేహం తరలింపు
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లాలో గ్యాంగ్ రేప్ జరిగిన బాధితురాలి డెడ్ బాడిని స్వాధీనం చేసుకున్న పెద్దపల్లి పోలీసులు నేరుగా హైదరాబాద్ గాంధీ హస్పిటల్ కు తరలించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 14న పెద్దపల్లి సమీపంలోని అప్పన్నపేట సమీపంలోని ఓ రియల్ వెంచర్ లో వలస కూలీ కుటుంబానికి చెందిన 16 ఏళ్ల మైనర్ ను నలుగురు గ్యాంగ్ రేప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన సదరు బాలికను ఆమె స్వస్థలం అయిన మధ్యప్రదేశ్ లోని బాల్కెడ జిల్లా కాజ్రీ గ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. బాలిక గ్యాంగ్ రేప్ అయిన విషయం వెలుగులోకి రావడంతో పెద్దపల్లి పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆమె డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలో రెండు బృందాలు మధ్యప్రదేశ్ కు వెళ్లాయి. కాజ్రీ గ్రామానికి చేరుకున్న పోలీసులు బాధిత బాలిక మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని హైదరాబాద్ లోని గాంధీ హస్పిటల్ కు తరలించారు. అక్కడే డెడ్ బాడీకి పోస్టు మార్టం చేసేందుకు సన్నాహాలు చేయడంతో పాటు, శవ పంచనామా కూడా చేయనున్నారు. నిపుణులైన డాక్టర్లచే పోస్టు మార్టం చేయించినట్టయితే అన్ని రకాలుగా నివేదికలు తీసుకుని కోర్టులో సమర్పించే అవకాశం ఉంటుందని భావించే రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోస్టు మార్టం తంతు పూర్తయిన తరువాత షార్ట్ ఒపినియన్ ఆధారంగా పోలీసులు బాలిక గ్యాంగ్ రేప్ నకు గురైందా లేదా అన్న విషయంపై ఓ నిర్దారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామూహిత అత్యాచారానికి గురయినట్టయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు, ఆ తరువాత ఆమెకు జరిగిన రక్తస్రావం తదితర అంశాలపై కూడా రిపోర్టులు సేకరించి దర్యాప్తు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్న పెద్దపల్లి పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీసినట్టు సమాచారం.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
