మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి మృతి

దిశ దశ, జగిత్యాల:

మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు అనారోగ్యానికి గురై మరణించారు. హై కోర్టు న్యాయవాదిగా పని చేసిన ఆయన ఓ సారి మెట్ పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా కోరుట్ల టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా అనారోగ్యానికి గురైన కొమొరెడ్డి హైదరాబాద్ లోని తన ఇంట్లో బుధవారం తుది శ్వాస విడిచారు. రాములు మరణంతో ఆయన అభిమానుల్లో విషాదం అలుముకోగా, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.