Karimnagar: కరీంనగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు….

రాజు గారి బిర్యాని అడ్డా రెస్టారెంట్ లో తనిఖీలు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు మళ్లీ దాడులకు శ్రీకారం చుట్టారు. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టి చర్యలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జ్యోతీనగర్ మల్కాపూర్ రోడ్డులోని రాజుగారి బిర్యాని అడ్డా అనే రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి ఆధ్యర్యంలో శుక్రవారం దాడులు చేశారు. విక్రయించేందుకు ఒక రోజు ముందు బాయిల్డ్ చేసిన చికెన్ అమ్మకాలు జరగకపోవడంతో ఫ్రీజర్ లో స్టోర్ చేసినట్టుగా గుర్తించారు. 17 కిలోల బాయిల్డ్ చేసిన చికెన్ ను, కార్న్, శాఖాహరానికి సంబంధించిన ఐటెమ్స్ కూడా గుర్తించి బయటపడేశారు. అలాగే కోడి మాంసంతో వండే పదార్థాల్లో నిబంధనలకు విరుద్దంగా కలర్స్ వినియోగిస్తున్నారని గుర్తించారు. కృత్తిమ రంగులు వాడకూడదని నోటీసులు ఇవ్వడంతో పాటు నాన్ వెజ్ పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగించే వాటిపై తేదీలు వేయడం లేదని గమనించారు. వీటిపై డేట్ లేబుల్స్ విధిగా వేయాలని కూడా ఆదేశించారు.