వరంగల్ నగరంలో ఫ్లెక్సీల కలకలం… పార్టీ మారిన వారిని హెచ్చరిస్తూ…

దిశ దశ, వరంగల్:

పార్టీలు మారే నాయకులను హెచ్చరిస్తూ వెలిసిన ఫ్లెక్సీలు వరంగల్ నగరంలో కలకలం సృష్టించాయి. అధికారంలో ఉన్న పార్టీల్లోకి మారే నాయకులకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా చెప్పుల దండ వేస మరి ప్రదర్శించారు గుర్తు తెలియని వ్యక్తులు. నగరంలోని ఎంజీఎం సెంటర్ తో పాటు పలు కాలనీలలో వెలిసినట్టుగా ప్రచారం జరుగుతున్న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కాలనీ వాసుల కష్టాలు ఇంకా ఎన్ని రోజులు..? మీ పతానికి చరమగీతం ముందు ఉంది అంటూ ముద్రించిన ఈ ఫ్లెక్సీలు పార్టీలు మారుతున్న నాయకుల తీరును ఎత్తి చూపుతున్నాయి. తరుచూ పార్టీలు మారుతూ అధికారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వారికి చెంప పెట్టులా అనిపిస్తున్న ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాలంలో వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. ఫిరాయింపుదారుల చర్యలతో విసుగెత్తిన వారే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంటారన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి సమయంలో ఏర్పాటు చేసినట్టుగా భావిస్తున్నఈ ఫ్లెక్సీలను తెల్లవారిన తరువాత నగర ప్రజలు గమనించారు. ఆ నోట ఈ నోట దావణంలో వ్యాపించిన ఈ ఫ్లెక్సీల గురించి తెలుసుకున్న మునిసిపల్ సిబ్బంది వాటిని వెంటనే తొలగించినట్టు సమాచారం. అయతే ఫ్లెక్సీలకు సంబంధించిన పోటోలు మాత్రం వైరల్ కావడంతో పూటకో రంగు మారుస్తున్న నాయకుల తీరును ఎత్తి చూపిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. పొలిటికల్ పార్టీల నేతలంటేనే ఫిరాయింపులే అన్నట్టుగా మారిపోయిన ఈ కాలంలో ఇలాంటి ఫ్లెక్సీలు వెలియడం అందరిని ఆలోచింపజేస్తోంది. అయితే ఇలాంటి ఫ్లెక్సీల ప్రదర్శనకు బ్రేకు పడాలంటే ముందుగా కండువాలు మారుస్తున్న నేతలు స్థిరత్వంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.

You cannot copy content of this page