దిశ దశ, హైదరాబాద్:
వాహనాల కొనుగోలు చేసేందుకు ఎంత శ్రద్ద కనబరుస్తామో వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ల విషయంలో అంతకన్నా శ్రద్ద కనబరుస్తుంటారు. నచ్చిన వాహనం కొనుగోలు చేయడమే కాదు… ఫ్యాన్సి నెంబర్ పై కూడా ప్రత్యేకంగా మక్కువ చూపించే వారు నేటికీ ఉన్నారు. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం జరిగింది. ఈ వేలంలో 9999 నెంబర్ కు రూ.9,99,999లకు అమ్ముడు పోయింది. టీఎస్ఈజడ్ 9999 నెంబర్ ను చర్చ్ ఎడ్యూకేషనల్ సొసైటీ కొనుగోలు చేసిందని ట్రాన్స్ పోర్ట్ జాయింట్ కమిషనర్ పాండు రంగనాయక్ తెలిపారు. అలాగే టీఎస్ఎఫ్ఎ 0001ను రూ. 3 లక్షలు వెచ్చించి కామినేని సాయి శివనాగ్, టీఎస్11ఎఫ్ఎ 0011 నంబర్ కు రూ.1,55,400 వెచ్చించి సామ రోహిత్ రెడ్డిలు కొనుగోలు చేశారన్నారు. ఈ వేలం పద్దతి ద్వారా ఆర్టీఏ విభాగానికి రూ. 18,02,970ల ఆదాయం వచ్చిందని వివరించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Next Post
