తెలంగాణలో భూకంపం… ముందే హెచ్చరికలు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూమి కంపించింది. జిల్లాలోని పలు ప్రాంతాలో రెండు సార్లు భూమిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 3 సెకన్ల పాటు భూకంపం తీవ్రత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి, కిసాన్ నగర్, విద్యారణ్యపురి, కమాన్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ఇండ్లలో ఉన్న ఫర్నీచర్, వస్తువులు వాటికవే కదులుతుండడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ తరువాత పరిస్థితి సద్దుమణగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న ఆందోళనతో ఆయా ప్రాంతాల వాసులు కలవరపడుతున్నారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కూడా భూకంపం సంభవించినట్టుగా తెలిసింది.

ముందే హెచ్చరిక…

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తుందని ఎప్రిల్ 10వ తేదినే భూకంపాలపై పరిశోధనలు చేసే నిపుణులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూకంపం సంభవిస్తుందని,  తెలంగాణాలోని హైదరాబాద్, వరంగల్, ఏపీలోని అమరావతి, మహారాష్ట్రలలో ప్రకంపనలు చోటు చేసుకుంటాయని స్పష్టం చేశారు. నిపుణులు హెచ్చరించినట్టుగానే తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో భూమిలో ప్రకంపనలు చోటు చేసుకోవడం గమనార్హం. 

You cannot copy content of this page