తల్లడిల్లిపోతున్న కుటుంబం…
దిశ దశ, జగిత్యాల:
ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది… చెట్టంత ఎదిగిన కొడుకును మృత్యువు కబళించింది… అనారోగ్యంతో బాధ పడుతున్న భార్య… యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లు… కష్టాల కడలిని ఈదడం ఎలా అని మదనపడిపోతున్న ఆయన హఠత్తుగా మరణించాడు. రెక్కడితే కానీ డొక్కడాని ఆ కుటుంబం పరిస్థితి మరీ దయనీయంగా ఉన్న దుస్థితోల ఉన్న ఒక్క పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అంత్యక్రియలు చేసేందుకు చేతిలో డబ్బులు కూడా లేవని వేధనకు గురవుతోంది ఆ కుటుంబం. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గత కొంత కాలంగా సీస కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది నరాల జాంగీర్ కుటుంబం. నిలువ నీడ కూడా లేని వీరు రోడ్డు పక్కన గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది. జాంగీర్ కు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు కాగా గత సంవత్సరం ప్రమాదవశాత్తు కుమారుడు చనిపోయాడు. దీంతో అప్పటి నుండి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జాంగీర్ మానసిక వేధనకు గురవుతూ కాలం వెల్లదీస్తున్నాడు. తన భార్య కూడా అనారోగ్యం బారిన పడడం… పెళ్లీడు కొచ్చిన ఇద్దరు కూతుర్లు ఉండడంతో జాంగీర్ లో మానసిక వేధన తీవ్రంగా పెరిగిపోయింది. మానసిక ఒత్తిడి తీవ్రం కావడంతో గుండె పోటుకు గురైన జాంగీర్ ఆదివారం విగతజీవిగా మారాడు. అతని అంత్యక్రియలు చేసేందుకు కూడా చేతిలో డబ్బులు లేకపోవడంతో జాంగీర్ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. కుటుంబాన్ని పోషించేందుకు చేదోడుగా నిలుస్తాడునుకున్న కొడుకు ఏడాది క్రితమే చనిపోగా ఇప్పుడు వారికి బాసటగా నిలిచే వారే లేకుండా పోయారు. చనిపోయిన జాంగీర్ శవానికి అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా లేదని కన్నీటి పర్యంతం అవుతున్న ఆయన భార్య తనతో పాటు తన బిడ్డలకు దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు స్థానికులకు కలిచివేస్తోంది. జాంగీర్ అంత్యక్రియలకు చేదోడుగా నిలిచేందుకు ముందుకు రావాలని స్థానికులు కోరుతుండగా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కూడా బాసటగా నిలవాలన్న అభ్యర్థిస్తున్నారు.
దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే మృతుని భార్య అకౌంట్ వివరాలు ఇవి…


