సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్
ఉత్తర తెలంగాణాలో బస
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయత్రం కరీంనగర్ చేరుకోనున్నారు. మద్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరనున్న సీఎం తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ లో బస చేస్తారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం తొలిసారిగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు తీగలగుట్టపల్లికి చేరుకోనున్న ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం మద్యాహ్నం వరకు కూడా కరీంనగర్ లోనే బస చేసే అవకాశాలు ఉన్న సీఎం కేసీఆర్ పార్టీ అంతరింగక వ్యవహారాలపై ఆరా తీయడంతో పాటు ఆయా జిల్లాల అధికారలతో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కరీంనగర్ తో పాటు తీగలగుట్టపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం బస చేయనున్న కేసీఆర్ భవన్ పరిసరాల్లో బందోబస్తు చర్యల్లో నిమగ్నం అయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post
