భక్తుల కోసం దర్శనం వేళల్లో మార్పులు
కాళేశ్వరం ఆలయ అధికారుల ప్రకటన
దిశ దశ, భూపాలపల్లి:
వేసవిలో భానుడి ప్రతాపం ఉగ్రరూపం దాల్చుతుండడంతో దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సౌకర్యార్థం దర్శనం వేళల్లో మార్పులు చేర్పులు చేశారు. మండుతున్న ఎండల్లో భక్తులు దర్శనం కోసం వచ్చి వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో దర్శనం వేళల్లో మార్పులు చేసినట్టు ఈఓ ఓక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు మారిన దర్శనం వేళలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరాన్ని సందర్శించాలని కోరారు. ఇప్పటి వరకు మద్యాహ్నం 1.30 గంటల వరకు ఆలయం మూసి సాయంత్రం 4 గంటలకు తెరిచే వారు. కానీ మంగళవారం నుండి మద్యాహ్నం ఒంటి గంటకే ఆలయాన్ని మూసివేస్తామని, సాయంత్రం తెరిచే సమయం మాత్రం యథావిధిగానే ఉంటుందని ఆలయ ఈఓ వివరించారు. ఎండ తీవ్రతల వల్ల భక్తులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నందున తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు.
