మంచిర్యాల జిల్లాలో దారుణం
దిశ దశ, చెన్నూరు:
వేములవాడకు వెల్లిన ఓ యువకుడికి ఓ మహిళ ఫోన్ చేసి తన ఇంటికి రావాలని పిలిచింది… ఆ ఇంట్లోకి వెల్లిన కొద్దిసేపట్లో అరుపులు వినిపించాయి. అతనితో వెల్లిన ఇద్దరు స్నేహితులు అయోమయానికి గురయ్యారు. అంతలోనే అతను శవమై అడవిలో దహనం అవుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా వివారాల్లోకి వెల్తే… మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ కమ్మెరపల్లిలో హత్యకు గురయ్యాడు. మృతుని బంధువులు చెప్తున్న వివరాల ప్రకారం… మహేందర్ వేములవాడకు వెల్తున్న క్రమంలో మహిళ పోన్ చేసి తన ఇంటికి రావాలని చెప్పడంతో తాను రాలేనని అన్నాడు. ఖచ్చితంగా రావల్సిందేనని మహిళ కోరడంతో వెనుదిరిగిన మహేందర్ కమ్మెరపల్లిలో ఇంటి సమీపంలో వాహనాన్ని నిలిపివేశాడు. అందులో తన వెంట ఉన్న ఇద్దరిని అక్కడే ఉండమని చెప్పి రావాలని పిలిచిన మహిళ ఇంట్లో లైట్లు వెలుగుతున్న విషయాన్ని గమనించి ఆమెకు ఫోన్ చేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేరు తానొక్క దానినే ఉన్నానని చెప్పడంతో నమ్మకంతో వెళ్లాడు. ఇంట్లోకు వెల్లగానే తలుపు వేశారు. అంతలోనే మహేందర్ అరవడంతో ఆందోళన చెందిన అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే కమ్మెరిపల్లి శివార్లలో మహేందర్ మృహదేహాన్ని తరలించిన కొందరు నిప్పంటించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పాక్షికంగా కాలిపోయిన శవాన్ని చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు చెన్నూరు పోలీసులు. అయితే ఈ హత్యకు కారణాలు ఏంటీ..? మృతుని కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలతో పాటు ఇతరాత్ర వివరాలను సేకరిస్తున్నారు. పోలీసు అధికారులు కూడా చెన్నూరులో జరిగిన ఈ ఘటనపై వివిధ కోణాల్లో ఆరా తీయాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న చెన్నూరు పోలీసులు కేసు పూర్వాపరాలను సేకరిస్తున్నట్టుగా సమాచారం.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
dishadasha
2175 posts
Next Post

