ట్రోలర్స్ కు బండి సంజయ్ పరోక్ష కౌంటర్…
దిశ దశ, కరీంనగర్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గత నాలుగు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నారని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పలు సోషల్ మీడియా అకౌంట్లలో సంజయ్ పర్సనల్ కాంటాక్ట్ నంబర్ కూడా స్విచ్ఛాప్ చేసుకుని ఎవరికి కలవడం లేదన్న కామెంట్లు కూడా చేశారు. కుమారుడి ఫోక్సో కేసు తరువాత ఆయన సెలెంట్ మోడ్ లోకి వెళ్లారని, ఇప్పుడు ప్రధాన అనుచరుడు అరెస్ట్ తో ఆయన అంతర్మథనంలో పడిపోయారంటూ సోషల్ మీడియాలో బండి సంజయ్ పై ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి ట్రోలింగ్ కు సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కుమార్ గత నాలుగైదు రోజులుగా తెరమీద కనిపించకపోవడంతో ఆయన గురించి వాకబు చేయడం మొదలైంది. బండి సంజయ్ సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులకు ఫోన్లు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లలేదన్న సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఎదురయింది.
మొక్క నాటి…
మంగళవారం ఉదయం నుండి ఆయనపై ట్రోల్ చేస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా ఎదురు దాడి చేయకుండా నేరుగా ప్రజల్లోకి వచ్చేశారు కేంద్ర మంత్రి. తాను ఎక్కడకు వెళ్లలేదని అజ్ఞాతంలోకి అసలే వెళ్లలేదని చెప్పకనే చెప్పినట బండి సంజయ్ తన తల్లి పేరిట మొక్కను నాటారు. ‘‘ఏక్ పేడ మా కే నామ్’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునందుకుని ఈ మేరకు కరీంనగర్ లో మొక్కను నాటారు బండి సంజయ్. ఈ సందర్భంగా గత నెలలో తల్లి అనారోగ్యానికి గురికావడ… ఆమెకు చికిత్స చేయించిన క్షణాలను తలుచుకున్న కేంద్ర మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు.
అనారోగ్యమే…
అయితే ఢిల్లీలో జరిగిన పలు అధికారిక కార్యక్రామల్లో హాజరైన అనంతరం కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్ కుమార్ అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జ్వరంతో పాటు ఇతరాత్ర అనారోగ్యానికి గురి కావడంతో ఇంట్లోనూ ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారని సమాచారం. అనారోగ్యానికి గురైన విషయం బయటకు పొక్కకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడినట్టుగా తెలుస్తోంది. ఆయనకు రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించడం… ఇంట్లోనే చికిత్స అందిస్తుండడంతో ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలిస్తే పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని గమనించే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్న బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ పుకార్లు పుట్టించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తరుచూ మీడియాలో కనిపిస్తే ఓ రకమైన వ్యాఖ్యలు… మీడియాకు దూరంగా ఉంటే మరో రకమైన కామెంట్స్ చేయడం వెనక ఆంతర్యం ఏంటో అంతుచిక్కడం లేదన్నారు.

