సీఎం హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం

దిశ దశ, మంచిర్యాల:

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ మరోసారి సాంకేతిక లోపానికి గురైంది. బుధవారం కాగజ్ నగర్ లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సందర్భంగా హెలిక్యాప్టర్ మొరాయించడంతో ఆసిఫాబాద్ లో జరగనున్న సభకు హాజరయ్యేందుకు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. ఇంతకుముందు కూడా వాయు మార్గం గుండా వెల్తున్న క్రమంలో హెలిక్యాప్టర్ మొరాయించడంతో ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో దిగాల్సి వచ్చింది. తాజాగా కాగజ్ నగర్ సభకు చేరుకున్న తరువాత చాపర్ లో సాంకేతిక సమస్య ఎదురయింది.