బీజేపీ స్టేట్ చీఫ్ ‘బండి’ ఇంట విషాదం

పరామర్శించిన మంత్రి గంగుల

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట విషాదం అలుముకుంది. సోమవారం తెల్లవారు జామున ఆయన అత్తమ్మ వనజమ్మ అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. రెండు రోజుల క్రితమే తీవ్ర అనారోగ్యానికి గురైన వనజమ్మను ఆసుపత్రికి తరలించి చికిత్సం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మరణ వార్త సమాచారం అందుకున్న బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్నారు. జ్యోతినగర్ లోని సొంత ఇంటికి మృతదేహాన్ని తీసుకరాగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నివాళులు అర్పించారు. సంజయ్ అతమ్మ మరణ వార్త తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కరీంనగర్ కు చేరుకుంటున్నాయి.

bandi sanjaybjp chief bandi sanjaybjp newsLatest Newstelangana news