కాలిపోయిన కార్లు… ఓనర్ల గగ్గోలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మూడు కార్లు అక్కడిక్కడే దగ్ధం కావడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు… పెద్దపల్లి సాగర్ రోడ్ లోని ఎల్ రాజయ్యకు చెందిన ఫామ్ హౌస్ లో కార్ పార్క్ చేస్తుండగా పెద్ద శబ్దంతో క్రెటా కారులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురైన డ్రైవర్ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటన జరిగిన స్థలం పక్కనే ఉన్న మరో రెండు కార్లు కూడా ఈ ప్రమాదంలో నిప్పంటుకున్నాయి. దీంతో మూడు కార్లు కూడా కాలిపోయాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగి తమ కార్లు దగ్దం కావడం యజమానులను కలిచివేసింది. అయితే ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది. సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయా లేక ఇతరాత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.

fire accidentLatest NewsPeddapallitelangana news