నాటునాటు పాటపై సూపర్బ్ డ్యాన్స్

కరీంనగర్ ఐఏఎస్ దంపతులు హంగామా

హోలి సంబరాలల్లో ఆ ఐఏఎస్ దంపతులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సహోద్యుగులతో కలిసి దంపతులు ఇద్దరూ రంగులు చల్లుకుని నాటు నాటు పాటపై డ్యాన్స్ చేశారు. ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో బిజీబిజీగా ఉండే కలెక్టర్ కర్ణన్ హోలి సంబరాల్లో తనలో దాడి ఉన్న డ్యాన్స్ ప్రదర్శించి అదరగొట్టేశారు. కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఆయన సతీమణి, జడ్పీ సీఈఓ ప్రియాంకలు ఇద్దరూ హోలీ సంబరాల్లో వివిధ శాఖల ఉద్యోగులతో కలసి ఆడి పాడారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసుకు వెల్లిన ఉద్యోగులతో కలిసి డిజే టిల్లు పాటకు కలెక్టర్ కర్ణన్ డ్యాన్స్ చేస్తే, దంపతులు ఇద్దరు కలిసి నాటు నాటు పాటకు నాట్యం చేశారు. జడ్పీ సీఈఓ ప్రియాంక సాంస్కృతిక కళల్లో ఒకటైన వీణతో తనలోని ప్రావిణ్యతను ఇప్పటి వరకూ కనబర్చారు. కానీ హోలీ సంబరాల్లో ఉద్యోగులతో కలిసి నాట్య మయూరిని తలపించారు.

హోలీ సంబరాల్లో కరీంనగర్ కలెక్టర్ కర్ణన్


HOLYKARIMNAGAR COLLECTORELatest NewsPRIYANKA IASRV KARNAN IAStelangana news