ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సుముఖ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఆదివారం ప్రారంభించిన ఈ ఆసుపత్రిలో ఈఎన్టీతో పాటు దంత సంబందిత వ్యాధులకు చికిత్స చేయడంతో పాటు సర్జరీలు కూడా నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు. శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సముఖ్ హస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, స్థానిక కార్పోరేటర్ వనం సంగీత శ్రీనివాస్, హౌజ్ ఫెడ్ ఛైర్మన్ కడారి నవనీత్ రావు, ఆసుపత్రి వైద్యులు హాస్పిటల్ సుదామ్స్ తిరునహరి, పరిమళలు పాల్గొన్నారు. వైద్య వృత్తిలో భాగ్యనగర్ వాసులకు సేవలందించాలన్న లక్ష్యంతోనే ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని డాక్టర్ దంపతులు తెలిపారు.

harishraoLatest Newstelangana newsthanneru