ఓ వైపున నిఘా… మరో వైపున భద్రత…

గోల్డ్ థీఫ్ సుభోధ్ సింగ్ కరీంనగర్ తరలింపు…

దిశ దశ, కరీంనగర్:

దేశంలో సంచలనాల దోపిడీలకు కేంద్ర బిందువుగా ఉన్న గోల్గ్ థీఫ్ సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ నిఘా నీడలో బిహార్ నుండి కరీంనగర్ తరలించారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని PMJ జ్యూవెలరీ షోరూం దోపిడీ కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. కోర్టు అనుమతితో సుబోధ్ సింగ్ ను విచారించే దోపిడీల గుట్టును తేల్చనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత…

బిహార్ పూర్ణియా జైలులో ఉన్న ఘరానా క్రిమినల్ సుబోధ్ సింగ్ ను గురువారం రాత్రి పోలీసులు వ్యూహాత్మకంగా తరలించారు. బిహార్ నుండి వాహనాల్లో తరలించాలని ప్లాన్ చేసిన పోలీసులు అతని గ్యాంగ్ ఎత్తులు చిత్తు చేస్తూ చివరి నిమిషంలో ఫ్లైట్ లో హైదరాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి కరీంనగర్ వరకు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. రాత్రి కరీంనగర్ చేరుకున్న తరువాత సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే సుబోధ్ సింగ్ నెట్ వర్క్, ఆయన టీమ్ కార్యకలాపల గురించి సునిశితంగా స్టడీ చేసిన కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వ్యూహాత్మక ఎత్తులతో కరీంనగర్ వరకు చేర్చడంలో సఫలం అయ్యారు. జైలు నుండే దోపిడీలకు స్కెచ్ వేసి తన టీమ్ కు బాధ్యతలు అప్పగించే సుబోధ్ సింగ్ ఆధారాలు చిక్కవన్న ధీమాతో ఉన్నప్పటికీ కరీంనగర్ పోలీసులు మాత్రం కీలకమైన ఆధారాలు సేకరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి అతని నుండి నిజాలు రాబట్టేందుకు అటు సాంకేతికత సహకారం తీసుకోవడంతో పాటు ఇంటరాగేషన్ ఎక్స్ పర్ట్స్ ను వినియోగించి అన్ని వివరాలను తెలుసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కౌంటర్ అటాక్…

పోలీసుల చెర నుండి తప్పించేందుకు సుబోధ్ గ్యాంగులు కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వారి అంచనాలు తలకిందులు చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణియా జైలు నుండి కరీంనగర్ వరకూ కూడా హై అలెర్ట్ ప్రకటించినంత రేంజ్ లో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. సుబోధ్ సింగ్ ను జైలుకు తరలించిన తరువాత కూడా పకడ్భందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు. సుబోధ్ గ్యాంగ్ కు సంబంధించిన కొంతమంది తెలంగాణాలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న సమాచారం అందుకోవడంతో నిఘా తీవ్రతరం చేశారని సమాచారం.

టెక్నాలజీ…

సుబోధ్ సింగ్ ప్రత్యేకంగా వినియోగిస్తున్న యాప్స్ వాటి ద్వారా చేసిన ఛాటింగ్ వీడియోలు, ఫోటోల షేరింగ్ అంశాలకు సంబంధించిన వాటిని కూడా రికవరీ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. 2018 నుండి జైలు జీవితం గడుపుతున్న సుబోధ్ సింగ్ ను పట్టుకున్నా కోర్టులో సాక్ష్యాధారలు చూపించే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న అనుమానంతో పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. నేరాలకు పాల్పడిన ముఠాలకు తనకు ఏమాత్రం సంబంధం లేదని ధీమా వ్యక్తం చేస్తూ ఇంతకాలం వివిధ రాష్ట్రాల పోలీసులకు చిక్కకుండా ఉన్న సుబోధ్ సింగ్ విషయంలో ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆధారాలు సేకరించాలన్న ధృఢ సంకల్పంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సుబోధ్ సింగ్ నెట్ వర్క్ ఏంటీ..? అతనికి వెన్నుదన్నుగా నిలుస్తున్న వారెవరూ..? అతను తప్పించుకునేందుకు ఎంచుకున్న మార్గాలు ఏంటీ అన్న వివరాలను కూడా తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఇంతకాలం ఏ రాష్ట్ర పోలీసులు కూడా సుబోద్ సింగ్ ను టచ్ చేయలేకపోయారని, అతనికి శిక్ష పడేందుకు కోర్టు ముందు ఉంచేందుకు బబలమైన సాక్ష్యాధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని గుర్తించిన కరీంనగర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

KARIMNAGAR POLICELatest NewsPMJ Jewellery ShowroomRobbery GangTG NEWS
Comments (0)
Add Comment