అంతర్మథనంలో సుబోధ్ గ్యాంగ్… తెలంగాణకు వచ్చి తప్పుచేశామా..?

దిశ దశ, కరీంనగర్:

గోల్డ్ థీఫ్ సుబోధ్ గ్యాంగ్ అంతర్మథనానికి గురవుతోందా..? ఉత్తరాది రాష్ట్రాలు వదిలేసి దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చి తప్పు చేశామా అన్న ఆలోచనలో పడిపోయిందా..? తెలంగాణ పోలీసులు వెంటాడుతున్న తీరు వారిని భయంలోకి నెట్టేస్తొందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

తొలిసారి…

గోల్డ్ థీఫ్ సుబోధ్ కుమార్ సింగ్ అలియాస్ బాబువా అలియాస్ గోల్డ్ గ్యాంగ్స్ థీఫ్ దేశంలోనే దోపిడీలు చేయడంలో సంచలనాలు సృష్టించారు. చట్టాలకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దేశంలోనే టాప్ రాబరీలు చేయించడంలో సక్సెస్ అయ్యాయి. అడగడుగునా నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని జైలు గోడల నుండే మానిటరింగ్ చేస్తూ టార్గెట్ రీచ్ కావడంలో సుబోధ్ గ్యాంగ్ టాప్ కేటగిరిలో ఉంది. ఇదే ధీమాతో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడింది. అయితే కరీంనగర్ పోలీసులు రాబరీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి సఫలం అయ్యారు. ఏ రాష్ట్రంలో దోపిడీ చేసినా దొరకని సుబోధ్ గ్యాంగ్ కరీంనగర్ రాబరీ తరువాత చిక్కడం సంచలనంగా మారింది. జైళ్లో ఉన్న సుబోధ్ సింగ్ ను దాదాపు ఆరేడు రాష్ట్రాల పోలీసులు వెళ్లి కలిసినా అతనిపై కేసు నమోదు చేయలేకపోయారు. కానీ పీఎంజే జ్యువెలరీ రాబరీని ఛాలెంజ్ గా తీసుకున్న కరీంనగర్ పోలీసులు సుబోధ్ గ్యాంగ్ ను పట్టుకునేందుకు అవసరమైన ఆధారాలు కూడా సేకరించి సక్సెస్ అయ్యారు. దోపిడీ ముఠా సభ్యులు ఇద్దరిని, వీరికి సిమ్ కార్డ్ విక్రయించిన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సుబోద్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని, ప్రధాన సూత్రధారి అతనేనని నిరూపించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎవిడెన్సెస్ ఆదారంగానే ఆరు కోర్టులలో కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్ వేసి అనుమతులు తీసుకుని సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కోర్టులో హాజరుపర్చగలిగారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు అంతర్మథనానికి లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో దోపిడీ చేయాలనుకోవడమే తాము చేసిన పెద్ద పొరపాటని, అందులో తెలంగాణాలోని కరీంనగర్ లో రాబరీ చేయడం తాము చేసిన భారీ తప్పిదమని మధనపడిపోతున్నారని తెలుస్తోంది.

ఫెయిల్యూర్…

సుబోధ్ సింగ్ గ్యాంగులు దేశంలో చేసిన రాబరీల్లో భారీ ఎత్తున నగలను ఎత్తుకెళ్లగలిగారు. కానీ కరీంనగర్ జ్యువెలరీ విషయంలో మాత్రం నామ మాత్రంగా ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మరో వైపున దేశంలో ఇంతవరకు జరిగిన ఏ దోపిడీలో కూడా కాల్పులు జరిపిన సందర్భాలే లేవని, కరీంనగర్ జ్యువెలరీ షోరూంలో పని చేస్తున్న ఉద్యోగులు అడ్డుకోవడంతో ఫైర్ చేయాల్సి వచ్చిందని… అటు టార్గెట్ మేరకు గోల్డ్ రాబరీ చేయలేకపోయామని, ఇటు తుపాకులకు పని చెప్పాల్సి వచ్చినందున తమ స్కెచ్ అమలు చేయడంలో విఫలం అయ్యామన్న భావనతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.

KARIMNAGAR POLICELatest NewsRobbery Gangtelangana newsTG NEWS
Comments (0)
Add Comment