సరయూ నదిలో గల్లంతు… జనగామలో విషాదం…

దిశ దశ, వరంగల్:

అయోధ్య శ్రీరాముడిని దర్శనం చేసుకునేందుకు వెల్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సరయూ నదిలో పుణ్య స్నానాలు చేస్తున్న క్రమంలో ఓ కుటుంబం గల్లంతు కాగా వారిలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మరోకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లా కేంద్రమైన జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు అయోధ్యలోని శ్రీరాముడిని దర్శించుకునేందుకు ఈ నెల 28న బయలుదేరింది. మరునాడు సరయూ నదిలో స్నానాలు చేస్తుండగా వరద తాకిడికి కుటుంబ సభ్యులంతా కొట్టుకపోయారు. నదిలో కొట్టుకపోతున్న వీరిని గమనించిన స్థానికులు నలుగురిని కాపడినప్పటికీ తేజశ్రీ మాత్రం గల్లంతయింది. ఇంటర్మీడియెట్ చదువుతున్న తేజశ్రీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా సమాచారం.

Ayodhyajanagamatelangana newswarangal