విలువలతో కూడిన విద్యతోనే సమాజ పురోగతి

బలగం కొమురయ్య

దిశ దశ, హుజురాబాద్:

విలువలతో కూడుకున్న విద్యే సమాజ పురోగతికి ఊతమిస్తుందని ‘బలగం కొమురయ్య’ పాత్రలో నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో విద్యార్థులు విజయం సాధించాలంటే పోటీతత్వం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చదువుపైనే శ్రద్ధ పెట్టాలని ఇతర అంశాలపై దృష్టి సారిస్తే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న యాజమాన్యం తీరును ఆయన అభినందించారు. కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… కరోనా కు ముందు కాలేజీలో 1300 మంది చదువుకునే వారని విపత్కర సమయం తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని కాలేజీకి పునర్ వైభవం తీసుకరావడానికి కృషి చేస్తున్నామన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురుని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల సలహాదారులు పి శంతన్ రెడ్డి, కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్, ఏ కె వి ఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, ట్రస్మా మండల అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్, విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, వి-బిలీవ్ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బలగం కొంమురయ్యను సన్మానిస్తున్న దృశ్యం
కళాకారుల ప్రదర్శనలు
ప్రసంగిస్తున్న బలగం కొమురయ్య(కేతిరి సుధాకర్ రెడ్డి)
Balagam moviebalgam komuraiahTollywood Latest NewsTollywood News