రెండో రోజూ కొనసాగుతున్న సిట్ విచారణ

దిశ దశ, జగిత్యాల:

గ్రూప్స్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో జగిత్యాలో జిల్లాలో రెండో రోజూ కూడా సిట్ అధికారుల విచారణ సాగుతోంది. మల్యాల మండలంలో 40 మందిని విచారించాల్సి ఉండగా మంగళవారం సిట్ టీమ్ కొంతమంది నుండి వాంగ్మూలాలు సేకరించింది. బుధవారం కూడా పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుండి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయింది. ఈ కేసులో ఏ2గా ఉన్న అట్ల రాజేశేఖర్ రెడ్డిది మల్యాల మండలమే కావడంతో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మల్యాల మండలానికి చెందిన వారి నుండి సిట్ వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం విచారణ గురించి బయటకు పొక్కనీయడం లేదు.

JAGITHYALLatest Newsleakage of tspsc papersSIT Inquirytelangana newsTSPSC