మంత్రి కొప్పులను అడ్డుకున్న జనం

వెల్గటూర్ లో ఘటన

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ స్థానికులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆయన కాన్వాయికి అడ్డంగా వెల్లారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. వెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి శివార్లలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం బయలుదేరారు. మార్గ మధ్యలో పాశిగామ, స్తంభంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కాన్వాయికి అడ్డంగా వెల్లి ఈ ప్రాంతంలో ఇథెనాల్ ప్రాజెక్టు నిర్మించొద్దంటూ ఆందోళన చేశారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోగా ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టు వల్ల ఐదు కిలోమీటర్ల మేర నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో తాము కూడా ఇలాగే ఇబ్బందులు పడ్తామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రజలకు సముదాయిస్తున్నా కూడా వినకుండా తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

నిరసన తెలుపుతున్న ప్రజలు
cm kcrLatest Newsminister koppulatelangana news