పొలిటికల్ లీడర్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్… పీసీసీ చీఫ్ టూర్ లో అపశృతి..?

దిశ దశ, కరీంనగర్:

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టూర్ లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ లో పీసీసీ చీఫ్ పర్యటన నేపథ్యంలో వాగ్వాదం జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్, మంత్రి హాజరైన ఓ సమావేశం వేదిక వద్ద నామినేటెడ్ పోస్టులో ఉన్న నాయకుని అనుచరులను ఓ పోలీస్ అధికారి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు నాయకుడు పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్దం చోటు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సదరు పోలీస్ అధికారి కూడా ప్రోట్ కాల్ కు విరుద్దంగా ఎలా నడుచుకుంటానని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్న మిగతా పోలీసులు సదరు పోలీస్ అధికారిని పక్కకు తీసుకెళ్లారు. డ్యూటీ చేసే విషయంలో కూడా ఇష్టారీతిన మాట్లాడితే ఎలా అంటూ సదరు పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. 

congress politicsKARIMNAGAR POLICEtelangana policeTG NEWStpcc chief
Comments (0)
Add Comment