దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో పోలీసుల సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుండే పలువురి ఇండ్లలో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. వడ్డీ వ్యాపారం చేస్తున్న వారి సమగ్ర వివరాలు ముందే సేకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే దాడులు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వడ్డీ వ్యాపారుల ఇండల్లో సోదాలు చేయడం ఆరంభించారు. పోలీసులు దాడులు నిర్వహిస్తున్న వారిలో రాజకీయనాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే ఒకరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. వడ్డీ వ్యాపారం చేసే వారి ఇండ్లలో అప్పు పేపర్లను, ష్యూరీటల కోసం తనఖా పెట్టుకున్న డాక్యూమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.